విజన్ డాక్యుమెంట్ పవిత్ర గ్రంధం : సీఎం రేవంత్

కలం, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం రూపొందించుకున్న తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఒక విజన్ (Telangana Vision Document) లాంటిదన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy). రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ విజన్ డాక్యుమెంట్ ఆధారంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అందుకే ఈ విజన్ తెలంగాణ అభివృద్దికి ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ అని విశ్వసిస్తున్నామన్నారు. దీని అమలుకు అహర్నిశలు శ్రమించడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలు జరిగిన అనంతరం ముగింపు ఉపన్యాసంలో సీఎం రేవంత్‌రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.

అదే మా విజన్..

“అధికారాన్ని మేం అందలంగా చూడటం లేదు… అత్యంత పవిత్ర బాధ్యతగా చూస్తున్నాం… రాష్ట్ర నిరుద్యోగ యువతను అధికారులుగా చూడాలనుకుంటున్నాం. అదే మా విజన్ డాక్యుమెంట్. మేం నాయకులం కాదు… ప్రజలకు సేవకులం… ఇదే మా ప్రజా ప్రభుత్వ విధానం… ఇకపైనా ఇలాగే ఉండాలనుకుంటున్నాం…” అని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. మారుమూల పల్లెలో పుట్టి పెరిగి చదువుకుని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన తనకు ప్రజల జీవితాలను అర్థం చేసుకున్న అనుభవం ఉన్నదన్నారు. ప్రజల కష్టం, త్యాగం విలువ తెలిసినవాడినన్నారు. అందుకే ఈ ప్రభుత్వం ప్రతీ అడుగులో పేదల భవిష్యత్తును, వారి జీవితాలు మెరుగుపడే అంశాలను చూస్తున్నదన్నారు.

Read Also: రాజకీయాలని కుదిపేస్తోన్న డ్రగ్స్ వివాదాలు

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>