Mobile Popup Ad
Mobile Popup Ad

గల్ఫ్ దేశాల నుంచి 2.6 లక్షల మంది ఇండియాకు

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో యుద్ధ (Iran–Israel War) వాతావరణం రోజురోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఎవరూ వెనకడుగు వేయట్లేదు. దీంతో మూడు దేశాలు ఢీ అంటే ఢీ అంటూ దాడులు (Iran–Israel War) చేసుకుంటున్నాయి. గల్ఫ్‌ దేశాలపై ఇరాన్ భీకరంగా దాడులు చేయడంతో.. ఆ దేశాల్లో ఉన్న భారతీయులు ఇండియా బాట పట్టారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆయా దేశాల సపోర్టుతో ఇప్పటి దాకా 2.6 లక్షల మంది ఇండియా చేరుకున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ప్రతి రోజూ 70 విమానాలు దుబాయ్ నుంచి ఇండియాలోని వివిధ ఎయిర్ పోర్టులకు నడుస్తున్నాయని.. కేంద్రం స్పష్టం చేసింది. టెహ్రాన్ నగరంలోని భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ ఇప్పటికే ఇతర దేశాలకు తరలిస్తోందని.. అక్కడి నుంచి వారు ఇండియా చేరుకుంటున్నట్టు కేంద్రం వెల్లడించింది. గల్ఫ్‌ దేశాల్లోని యూఎస్ ఎయిర్ బేస్ ల మీద ఇరాన్ దాడులు చేస్తోంది. దీంతో వాటికి సరిహద్దుల్లో ఉన్న ఇండియన్లను జాగ్రత్తగా స్వదేశానికి తరలించేందుకు ఆయా దేశాల అధ్యక్షులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. భారతీయుల భద్రతపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>