Mobile Popup Ad
Mobile Popup Ad

ఏఎఫ్సీఓఎన్ టైటిల్ రద్దుపై న్యాయపోరాటం!

కలం, వెబ్ డెస్క్: ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ విజేతగా నిలిచిన సెనెగల్ (Senegal)  జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జనవరిలో గెలుచుకున్న టైటిల్‌ను రద్దు చేస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్‌బాల్ (Football) తీసుకున్న నిర్ణయాన్ని సెనెగల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అన్యాయమైన తీర్పుపై తాము అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయిస్తామని సెనెగల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రకటించింది. జనవరిలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొరాకోకు పెనాల్టీ కేటాయించడాన్ని నిరసిస్తూ సెనెగల్ కోచ్ పాపే థియావ్, ఆటగాళ్లు సుమారు 15 నిమిషాల పాటు మైదానాన్ని వీడారు.

ఆ తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది. మొరాకో ఆటగాడు బ్రాహిమ్ డియాజ్ కొట్టిన పెనాల్టీని సెనెగల్ అడ్డుకుంది. ఎక్స్‌ట్రా టైమ్‌లో పాపే గై కొట్టిన గోల్‌తో సెనెగల్ విజేతగా నిలిచింది. అయితే, మ్యాచ్ మధ్యలో నిరసన తెలిపినందుకు సెనెగల్ ఓడిపోయినట్లుగా పరిగణిస్తూ, మొరాకోను 3-0తో విజేతగా ప్రకటిస్తూ తాజాగా కాఫ్ అప్పీల్ బోర్డు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని, దీనికి ఎటువంటి ఆధారాలు లేవని సెనెగల్ ఎఫ్ఏ సెక్రటరీ జనరల్ అబ్దౌలాయే సెడౌ సో నిరసన వ్యక్తం చేశారు. ఇది ఆఫ్రికన్ ఫుట్‌బాల్‌కే అవమానమని ఆయన అభిప్రాయపడ్డారు. మొదట క్రమశిక్షణా విచారణలో కేవలం జరిమానాలు, నిషేధాలు విధించిన కాఫ్, ఇప్పుడు ఏకంగా ఫలితాన్ని మార్చడం ఆమోదయోగ్యం కాదని ఫెడరేషన్ పేర్కొంది.

న్యాయం తమ వైపే ఉందని, ఈ అన్యాయమైన తీర్పుపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని సెనెగల్ స్పష్టం చేసింది. తమ న్యాయవాదుల బృందంతో కలిసి పై కోర్టులో పోరాడి నిజానిజాలను నిరూపిస్తామని వెల్లడించింది. ఈ వివాదంపై అంతర్జాతీయ క్రీడా కోర్టు ఇచ్చే తుది తీర్పు కోసం ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>