కలం, వెబ్ డెస్క్: జపాన్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల వేలంలో ఒక చేప (Japan Fish) రికార్డు స్థాయిలో రూ.29 కోట్లకు అమ్ముడైంది. 243 కిలోల బ్లూఫిన్ ట్యూనా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపగా మారింది. ఎందుకంత ప్రత్యేకత అంటే.. దీని మాంసం చాలా మృదువైంది. జ్యూసీగా ఉంటుంది. కొవ్వుతో సమృద్ధిగా ఉంటుంది. రుచి, రంగు, ఆకృతిపరంగా ఇది ఇతర రకాల చేపల కంటే భిన్నమైంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రజాదరణ పెరుగుతోంది.
బ్లూఫిన్ ట్యూనా చేప కేవలం ఆహారానికే (Food) పరిమితం కాదు. నూతన సంవత్సరంలో జరిగే మొదటి వేలాన్ని శుభప్రదంగా భావిస్తారు. మొదటి వేలంలో అధిక ధరకు బిడ్ వేయడం వల్ల ఏడాది పొడవునా మంచి వ్యాపారం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. అందుకే పెద్ద కంపెనీలు, ప్రముఖ రెస్టారెంట్లు ఎన్ని కోట్లయినా దక్కించుకోవడానికి సిద్ధపడతారు.
బ్లూఫిన్ ట్యూనాను పట్టుకునేందుకు పెద్ద వలలను ఉపయోగించరు. ‘హైంకార’ టెక్నిక్ ద్వారా పట్టుకుంటారు. ఇది ఒక సాంప్రదాయ జపనీస్ ఫిషింగ్ పద్ధతి. ఒమా నగరానికి చెందిన మత్స్యకారులు సముద్రం మధ్యలో గడ్డకట్టే సమయంలో గంటల తరబడి కష్టపడి చేపలను సజీవంగా పట్టుకుంటారు.

Read Also: అమెరికా సంచలన నిర్ణయం: 66 అంతర్జాతీయ సంస్థల నుంచి నిష్క్రమణ
Follow Us On: Instagram


