కలం, వెబ్ డెస్క్: Venkatesh Remuneration | మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ తొలి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి వెంకటేశ్‌కు గెస్ట్ రోల్ సూచించిన తర్వాతే ప్రారంభమైంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఆలోచనను డెవలప్ చేసి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్ ప్రారంభమైన తర్వాత వెంకీని లాక్ చేశారు. తన పాత్ర కోసం 15 రోజులు కేటాయించాడు వెంకటేశ్. రెండో భాగంలో ఒక పాటతో సహా 20 నిమిషాలు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. చిరంజీవి, వెంకటేశ్‌లపై చిత్రీకరించిన ప్రీ-క్లైమాక్స్ భాగాలు మూవీకి ప్రధాన హైలైట్‌గా నిలువనున్నాయి.
వెంకటేశ్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం 9 కోట్ల రూపాయల పారితోషికం (Venkatesh Remuneration) తీసుకున్నట్లు సమాచారం. ఒకే షెడ్యూల్‌లో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆయన, ఆ తర్వాత చిరుతో కలిసి పాటలో కనిపించారు. ఈ మూవీలో నయనతార కథానాయిక. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read Also: సంక్రాంతికి వస్తున్న కింగ్ నాగార్జున
Follow Us On : WhatsApp


