కలం, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన తాజా చిత్రం “ది రాజాసాబ్” (The Raja Saab). టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ మూవీ ఈ నెల 9వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు మొదటి షో నుంచే డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపుతుందని అంతా భావించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసింది.
నెగెటివ్ టాక్‌తో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం ఒక్క ప్రభాస్ సినిమాకి మాత్రమే సాధ్యం అవుతుంది. అయితే ప్రభాస్‌కి ఉన్న పాన్ ఇండియా మార్కెట్‌కి ఈ కలెక్షన్స్ చాలా తక్కువనే చెప్పాలి. పోటీగా మెగాస్టార్ సినిమా ఉన్నా కానీ రాజాసాబ్ సినిమాకు రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఈ సంక్రాంతి పండుగ రాజాసాబ్‌కు బాగానే కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అయితే లాంగ్ రన్‌లో ఈ మూవీ ఏ మేరకు కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

Read Also: ఖండాంతరాలు దాటిన ప్రేమ: ఫ్రాన్స్ యువకుడితో ఖమ్మం యువతి వివాహం
Follow Us On: Sharechat


