కలం, వెబ్ డెస్క్ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao). తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో మేం ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవట్లేదు. మా పార్టీకి ఎవరైనా మద్దతు తెలిపితే స్వాగతిస్తాం. జనసేన పోటీ చేయడాన్ని వ్యతిరేకించడం దేనికి. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అందులో తప్పులేదు. మా పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుస్తాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు కీలక బాధ్యత తీసుకున్నారు. ఈ ఎన్నికల కోసమే ఎంపీలు సమావేశం అయ్యారు. కానీ నాకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారంటూ తప్పుడు కథనాలు రాస్తున్నారు. అందులో ఎలాంటి నిజాలు లేవు‘ అంటూ తెలిపారు రాంచందర్ రావు.
జనసేనతో పొత్తుపై రాంచందర్ రావు (Ramchander Rao) మాట్లాడుతూ.. ఆ పార్టీతో ఏపీలోనే పొత్తు ఉంది.. తెలంగాణలో బీజేపీకి బలమైన పట్టు ఉందన్నారు. కాబట్టి తాము ఒంటరిగానే వెళ్తామని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అంటూ చెప్పుకొచ్చారు రాంచందర్ రావు. బీజేపీ నుంచి ఒక్కో వార్డుకు ఆరుగురు దాకా పోటీ పడుతున్నారు. మాకు ఎక్కువ సీట్లు వస్తాయనే భయంతోనే కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారు‘ అంటూ విమర్శించారు రాం చందర్ రావు.
Read Also: పాకిస్థాన్–చైనా అక్కడ ఏం చేసినా చట్టవిరుద్ధమే : భారత్
Follow Us On : WhatsApp


