epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్​లో రాజాసాబ్ జోరు

కలం, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ (The Raja Saab) సినిమా యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. ఈ సినిమా ప్రీమియర్స్ కు ఇప్పటికే దాదాపు వన్ మిలియన్ డాలర్స్ టికెట్ సేల్స్ జరగడం విశేషం. నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని ప్రత్యాంగిరా మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాజా సాబ్ టికెట్ సేల్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో రాజా సాబ్ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రీమియర్ షోస్ కు జరుగుతున్న భారీ టికెట్ సేల్స్ ద్వారా తెలుస్తోంది.

రాజా సాబ్ సినిమా హారర్ కామెడీ మూవీ కాబట్టి ఈ జానర్ కు సహజంగానే ఫ్యామిలీ ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దానికి తోటు ప్రభాస్ స్టార్ డమ్ క్రేజ్ కూడా ఈ అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపిస్తోంది. ప్రభాస్​కు  ఓవర్సీస్ లో స్ట్రాంగ్ బేస్ ఉంది. ఓవర్సీస్ లో ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేశాయి. బాహుబలి 2 దాదాపు 20 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించగా, కల్కి దాదాపు 18 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రాబట్టింది. సలార్ కూడా 8 మిలియన్ డాలర్స్ పైనే కలెక్ట్ చేసింది. ఇలా ప్రభాస్ (Prabhas) సినిమాలు పాన్ ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. రాజా సాబ్ కూడా అలాంటి ఫీట్ చేస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

ప్రమోషన్స్ ద్వారా రాజా సాబ్ అందరి అటెన్షన్ రాబడుతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన నాచె నాచె సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయ్యింది. ఈ పాట డిజిటల్ వ్యూస్ లో దూసుకెళ్తోంది. తాజాగా రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజా సాబ్ రన్ టైమ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 3 గంటల నిడివి ఉన్న మూవీ కంటెంట్ ను ఓవర్సీస్​కు పంపించారు. ఫస్టాఫ్ 1.25 నిమిషాలు, సెకండాఫ్ 1.35 నిమిషాలు ఉండబోతోందట. జనవరి 8న ప్రీమియర్స్ పడుతున్నాయి. తెలంగాణ లో ఇంకా టికెట్ రేట్ల పెంపు, బెన్ ఫిట్ షోస్​కు అనుమతి దక్కలేదు.

The Raja Saab
The Raja Saab

Read Also: ఈ నెల 18న మేడారానికి సీఎం రేవంత్​ రెడ్డి: సీతక్క

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>