కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) కు తుది జాబితా ఈ నెల 12న విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణ, సన్నద్ధతపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు పలు సూచనలు, సలహాలు చేసింది. ఆ వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రకారం.. వార్డు వారీ ఓటర్ల తుది జాబితా ఈ నెల 12న విడుదల చేయాలి. అలాగే 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితా వెల్లడించి, టీ–పోల్‌లో అప్లోడ్ చేయాలి. 16న ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను పోలింగ్ స్టేషన్ల వారీ ప్రచురించాలి.
పోలింగ్‌కు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు అంచనా సిద్ధం చేయాలి. ఆర్వో(రిటర్నింగ్ ఆఫీసర్స్)లు, సహాయ ఆరోవోలు, జోనల్ ఆఫీసర్లు నియామకం త్వరగా పూర్తిచేయాలి. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల నియామకమూ పూర్తిచేయాలి. పోలింగ్ సిబ్బంది నియామకం కోసం ఎంపిక చేసిన ఉద్యోగుల వివరాలను టీ–పోల్‌లో అప్లోడ్ చేయాలి. మున్సిపల్ ఎన్నికల (Municipal Elections)ను అత్యంత పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
Read Also: వెండికి కూడా హాల్ మార్కింగ్..! కేంద్రం నయా ప్లాన్
Follow Us On: Sharechat


