కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారాన్ని మించిపోయే స్థాయిలో వెండి (Silver) ధర పరుగులు పెడుతోంది. గతంలో అత్యంత విలువైన పుత్తడిని ప్లేస్ లో సిల్వర్ చేరుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.50 లక్షలు క్రాస్ చేసింది. అయితే, వెండి ధరలు రికార్డు స్థాయి పెరగడంతో వినియోగదారులు మోసాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను మోసాల నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే గోల్డ్ తరహాలోనే సిల్వర్ (Silver Hallmarking) కి కూడా హాల్ మార్కింగ్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో వెండికి హాల్ మార్కింగ్ తప్పని సరి ఏం కాదు.. కానీ, పెరుగుతున్న ధరల కారణంగా వెండికి కూడా బంగారం లాగే నాణ్యత ధృవీకరణ అవసరం అని పరిశ్రమ వర్గాలన నుంచి డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలోనే కొత్త నిబంధనలు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్) డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్డ్ తెలిపారు. కొత్త నిబంధనలు నిబంధనలు తీసుకొచ్చే ముందు అవసరమైన వనరులు, మౌలిక సదుపాయాలపై అంచనా వేయనున్నట్లు వెల్లడించారు ఆ తర్వాతే వెండికి హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే బంగారానికి హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపథ్యంలో, వెండికి కూడా అమలు చేస్తే వినియోగదారులు మోసపోకుండా భద్ర ఉంటుంఇ. హాల్‌మార్కింగ్ అనేది లోహ స్వచ్ఛతకు, నాణ్యతకు అధికారిక ప్రమాణంగా గుర్తింపు. భారత ప్రభుత్వం 2021 జూన్ నుంచి బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల కొనుగోలుదారులు మోసపోకుండా ఉండే అవకాశం పెరిగింది. అదే విధంగా వెండికీ ఈ విధానం అమలులోకి వస్తే వినియోగదారులకు స్పష్టమైన నాణ్యత హామీ లభించనుంది.
బీఐఎస్ గణాంకాల ఆధారంగా, 2024లో హాల్‌మార్క్ ఉన్న వెండి వస్తువుల సంఖ్య 31 లక్షలు కాగా, 2025 నాటికి అది 51 లక్షలకు చేరింది. అంటే హాల్ మార్కింగ్ పట్ల వినియోగదారుల్లో ఆసక్తి పెరుగుతోందని అర్థమవుతోంది. అయినప్పటికీ, ప్రస్తుతం వెండికి ఇది చట్టబద్ధంగా తప్పనిసరి కాకపోవడంతో అనేక చోట్ల నాణ్యతపై సందేహాలు తలెత్తుతున్నాయి.

Read Also: TGSRTC గుడ్ న్యూస్.. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు రయ్ రయ్
Follow Us On : WhatsApp


