కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ విమానయాన చరిత్రలో కీలక ఘట్టం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు తొలి వాణిజ్య విమానం ట్రయల్ రన్ నిర్వహించారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో (Bhogapuram Airport) ల్యాండ్ అయింది. ఈ ప్రత్యేక విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu), విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (Appalanaidu Kalisetti), అలాగే డీజీసీఏ (DGCA) అధికారులు ప్రయాణించారు..
ఈ ఏడాది జూన్ 26న విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు జీఎంఆర్ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. మొదటి దశలో ఈ విమానాశ్రయం ద్వారా ఏటా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ప్రణాళికలు రూపొందించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభించేలా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి భారీ ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Read Also: రేవంత్ ఆరోపణలకు హరీశ్ స్ట్రాంగ్ కౌంటర్
Follow Us On: Sharechat


