కలం వెబ్ డెస్క్ : సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు(RTC Bus) స్కూటీని ఢీకొనడంతో ఓ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. రామచంద్రపురంలోని బొంబాయి కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి బీరంగూడలోని ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పని చేస్తుంది. రోజులాగానే ఆదివారం ఉదయం తన ఇంటి నుంచి స్కూటీపై బీహెచ్ఈఎల్ డిపో మీదుగా జిమ్‌కు బయలు దేరింది. బీహెచ్ఈఎల్ బస్ డిపో వద్ద ఏలూరుకు చెందిన ఆర్టీసీ బస్సు యువతి స్కూటీని ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. యువతి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.


