కలం వెబ్ డెస్క్ : ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (YouTuber Anvesh)పై నెటిజన్ల ఆగ్రహం కొనసాగుతోంది. హిందూ దేవతలను, ప్రవచన కర్తలను అవమానించే విధంగా అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు పోలీస్ స్టేషన్లలో అన్వేష్‌పై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆస్ట్రేలియాలో (Australia) భారతీయులు అన్వేష్‌పై ఫిర్యాదు చేశారు. అన్వేష్ ఆస్ట్రేలియా రాకుండా వీసా రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కోరారు. అన్వేష్‌కు ప్రపంచ యాత్రికుడిగా పేరున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే అతడు ఎన్నో దేశాలు తిరిగాడు. ఈ క్రమంలో గతంలో ఆస్ట్రేలియా కూడా వెళ్లాడు. మరి ఈ తాజా ఫిర్యాదుతో ఆస్ట్రేలియా అన్వేష్‌పై ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అన్వేష్ మళ్లీ ఆస్ట్రేలియాలో అడుగు పెట్టగలడా? లేడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అన్వేష్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ వివరాలు కోరుతూ ఇన్‌స్టా యాజమాన్యానికి లేఖ రాశారు. దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Read Also: భోగాపురం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన తొలి విమానం..
Follow Us On: Youtube


