రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ డార్లింగ్స్‌కు అదిరిపోయే న్యూస్ ఒకటి సినీ సర్కిల్స్ తెగ వినిపిస్తోంది. ప్రభాస్ బర్త్‌డేకి ‘రాజాసాబ్(Raja Saab)’ టీమ్ అదిరిపోయే ట్రీట్ ప్లాన్ చేస్తోందట. ఆ ట్రీట్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మారుతి(Maruthi) డైరక్ట్ చేస్తున్న ఈ మూవీ హారర్ కామెడీగా తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ సంక్రాంతి బరిలోకి దిగనుంది. ఫ్యాన్స్‌కు చెప్పిన దానికన్నా 100 రోజుల ముందే ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఇప్పుడు ప్రభాస్ బర్త్‌డేకు భారీగా ప్లాన్ చేస్తోంది. అయితే అదేంటి అనే దానిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ భారీ హింట్ ఇచ్చాడు.
అక్టోబర్ 23న ఎంట్రీ ఇవ్వడానికి ‘రాజాసాబ్(Raja Saab)’ రెడీ అని తమన్ చెప్పాడు. దీంతో ఇది కచ్ఛితంగా మూవీ ఫస్ట్ సింగిల్ అయి ఉంటదని అభిమానులు ఊహాగానాలు స్టార్ట్ చేశారు. మరికొందరు ఫస్ట్ సింగిల్ కాదని.. పవర్‌ఫుల్ గ్లింప్స్ అయి ఉంటుందని భావిస్తున్నారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్లు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిథీ కుమార్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. డార్లింగ్‌ను ఇలాంటి రోల్‌లో చూసి చాలా కాలమైందని అభిమానులు ఉంటున్నారు. మరి ఫ్యాన్స్‌ను అంచనాలను ప్రభాస్ అందుకుంటాడా లేదా అనేది సంక్రాంతికి చూడాల్సిందే.
Read Also: కృతి సనన్‌కు అరుదైన గౌరవం.. తొలి నటిగా రికార్డ్..

