గుజరాత్ మంత్రివర్గం(Gujarat Cabinet)లో టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా భార్య రివాబా జడేజా(Rivaba Jadeja)కు స్థానం దక్కింది. ఇటీవల గుజరాత్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాటి కారణంగా సీఎం మినహా మిగిలిన మంత్రులు అంతా పదవులకు రాజీనామా చేశారు. దీంతో అక్కడ కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. అందులో రివాబాకు అవకాశం దక్కింది. గుజరాత్ గాంధీ నగర్‌లో మొత్తం 26 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
వ్యవస్థాగత, రాజకీయ సవాళ్లను ఎదర్కోవడం కోసం కేబినెట్(Gujarat Cabinet)ను పునఃవ్యవస్థీకరించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానాలలో ఇప్పుడు కొత్తవారు పదవులను చేపట్టారు. గుజరాత్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 182. నిబంధన ప్రకారం.. మంత్రుల సంఖ్య 27 వరకు ఉండొచ్చు.
Read Also: ‘రాజాసాబ్’ ఎంట్రీకి అంతా రెడీ..!

