ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు(Chandrababu) గారడీ చేస్తూ పాలన కొనసాగిస్తున్నారంటూ వైసీపీ నేత మార్గాని భరత్(Margani Bharat) విమర్శలు చేశారు. వైఎస్ఆర్‌సీపీ హయాంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమాన్ని తాము ప్రచారం చేయలేకపోయామని అన్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ప్రజలను మాటలతో బురిడీ కొట్టించేస్తున్నారని, అరచేతిలో వైకుంఠం చూపించి గాల్లో తేలే మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అందుకు హైటెక్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు అతిపెద్ద ఉదాహరణ అని అన్నారు. ఒక బిల్డింగ్ కట్టి హైటెక్ సిటీ నేనే కట్టానని చెప్పుకోవడం వారికి అలవాటు అని చురకలంటించాయి. హైదరాబాద్‌ను కూడా తానే అభివృద్ధి చేశా, కట్టా అని చెప్పుకుంటుంటారని అన్నారు. కానీ వైసీపీ(YCP) మాత్రం ఎన్నో అభివృద్ధి పనులు చేసినా వాటిని ప్రచారం చేసుకోవడంలో విఫలమైందని వివరించారు.
Read Also: ఒకే ఇంట్లో 22 దొంగఓట్లు: జగదీష్ రెడ్డి

