Mobile Popup Ad
Mobile Popup Ad

మహబూబ్‌నగర్‌లో ఘనంగా టీజీఎంఈయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (TGMEU, AITUC అనుబంధం) 12వ ఆవిర్భావ (TGMEU Foundation Day) దినోత్సవ వేడుకలు బుధవారం మహబూబ్ నగర్ (Mahabubnagar) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. బ్రాంచ్ మేనేజర్ వెంకటేష్ అధ్యక్షత వహించగా, టీజీఎంఈయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.మధుసూదన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ఆవిర్భావ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్బంగా వైద్య ఉద్యోగుల హక్కులు, తక్షణ, దీర్ఘకాలిక సమస్యలు, యూనియన్ చరిత్ర, పోరాట ఘట్టాలు, సాధించిన విజయాలు, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కోటేశ్వర్ రెడ్డి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నేత అరుణ్, అవుట్ సోర్సింగ్ థాంక్స్ అధ్యక్షులు గోపాల్ నాయక్, సతీష్ రెడ్డి, నర్సింగ్ ఆఫీసర్స్ నేత శ్రావణి, నేతలు రంగన్న, దేవానంద్, చెన్నయ్య, మొగులయ్య, బాలకోటి, అంజి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఆ దమ్ము, పౌరుషం పొంగులేటికి ఉందా?: కేటీఆర్ సవాల్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>