కలం, వెబ్ డెస్క్: ఏపీలో వంగలపూడి అనిత (Vangalapudi Anitha), గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath)ల విమర్శల పర్వం ముదురుతోంది. అమర్‌నాథ్ క్షమాపణలు చెప్పాలని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తుంటే.. ఆయన మాత్రం తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా తన వ్యాఖ్యలకు వస్తున్న విమర్శలపై అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. అనితపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్నారు. తమ పార్టీ నేతలపై, తన నాయకుడిపై చేసిన వ్యాఖ్యలను మాత్రమే తాను ఖండించినట్లు అమర్‌నాథ్ వెల్లడించారు. తన వ్యాఖ్యలను మొత్తం మహిళా లోకానికి అన్వయించకూడదని సూచించారు.
కూటమి నేతలు తన వ్యాఖ్యలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై తనకు ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేశారు. తన గురించి హోం మంత్రి అనిత అమర్యాదకరంగా మాట్లాడరని, గతంలో అనిత వైఎస్ జగన్ (YS Jagan) కుటుంబసభ్యులపై కూడా నీచంగా మాట్లాడారని, ఆ వ్యాఖ్యలకు ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదని అన్నారు. ఇప్పుడు తనను (Gudivada Amarnath) నిందిస్తున్న వాళ్లందరికీ ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వారు అలా నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైందేనా అని ప్రశ్నించారు.
Read Also: అవమానాలు కలిచివేస్తున్నాయి.. హోం మంత్రి అనిత ఆవేదన
Follow Us On: X(Twitter)

