కలం, తెలంగాణ బ్యూరో : ‘రాష్ట్రమంతటా వెలుగులు పంచుతున్నాం.. కానీ మా బతుకుల్లో మాత్రం వెలుగు లేదు’.. ఇదీ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఆవేదన. ‘ఆర్టిజన్ కార్మికుల డిమాండ్లపై గతేడాది నుంచి ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతున్నది.. పరిష్కారం కాకముందే సమ్మెకు (Artisans Protest) దిగడం నిబంధనల ఉల్లంఘనే’.. ఇదీ విద్యుత్ శాఖ వాదన.
ఎవరి వాదన ఎలా ఉన్నా గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా దాదాపు 20 వేల మందికి పైగా ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించలేకపోయాయి. చివరకు నిరసనలు, ఆందోళనలు, సమ్మె తప్పలేదు. సమ్మెలపై ఆరు నెలల నిషేధం విధిస్తూ ఫిబ్రవరిలోనే నోటీసులు జారీ అయ్యాయన్నది జెన్‌కో, ట్రాన్స్‌కో వాదన. నోటీసులు ఇచ్చిన తర్వాత స్పందన లేకపోవడంతోనే నిరవధిక సమ్మెకు దిగామన్నది ఆర్టిజన్ కార్మికుల జేఏసీ వివరణ. సమ్మె చేస్తే టెర్మినేషన్ తప్పదని జెన్‌కో, ట్రాన్స్ కో సంస్థలతో పాటు డిస్కమ్‌లు కూడా సర్క్యులర్ జారీ చేశాయి. బేషరతుగా 24 గంటల్లో సమ్మెను విరమించి విధుల్లో చేరాలని స్పష్టం చేశాయి. సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులపై చర్యలు తీసకోవాలంటూ
ఆయా విభాగాల ఉన్నతాధికారులకు సర్క్యులర్ జారీ అయింది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్టిజన్ కార్మికులను ఆకాశానికెత్తారు. సర్వీస్ రూల్స్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆచరణ మాత్రం అందుకు భిన్నం. కాంగ్రెస్ సైతం అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా అందులో భాగమైన ఆర్టిజన్ కార్మికుల విషయంలో మాత్రం ఆశించిన పురోగతి లేదు. ఫీల్డులో పని చేస్తున్న ఆర్టిజన్ వర్కర్లు సమ్మెలోనే కొనసాగితే వారి ఉద్యోగాల టెర్మినేషన్ సంగతి ఎలా ఉన్నా రోజువారీ విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారమెలా అనేది చర్చనీయాంశం.
ఆర్టిజన్ల సేవల ప్రాముఖ్యతను గుర్తించే విద్యుత్ డిపార్టుమెంటులోని ఉద్యోగుల నుంచి సంఘీభావం కరువైంది. ‘ఆర్టిజన్ కార్మికులు’ అనే వ్యవస్థ ఎప్పుడొచ్చింది? వారి ఉద్యోగాలకు భద్రత ఉన్నదా? దీర్ఘకాలంగా వారు చేస్తున్న డిమాండ్లలో న్యాయమున్నదా? విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ చనిపోతే పరిహారం అందుతున్నదా? తదితర అంశాలపై ‘కలం‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

