Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఆ పార్టీని వీడి గులాబీ పార్టీలో చేరేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయిందని ఆరోపించారు. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునే వారని, కానీ ఇప్పుడు సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తుందని మండిపడ్డారు.

‘రూలర్’లా సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒక్కడే ఏకపక్షంగా ‘రూలర్’లా వ్యవహరిస్తున్నారని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రస్తుతం పీసీసీ అనేది కేవలం ముఖ్యమంత్రి ఆదేశాలను చేసే అమలు చేసే ఒక విభాగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ చేసే తప్పులకు చివరికి ఏఐసీసీ (AICC) నిందించడం సరికాదని, పార్టీ మాత్రమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తిరోగమనంలో పయనిస్తోందని చెప్పారు. తనకు 14 సార్లు B ఫామ్ ఇచ్చారంటే అది తన సమర్థతోనే ఇచ్చారని.. తాను కంటెంట్ ఉన్న నాయకున్నీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలి..

ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు.ప్రజలందరూ ఇప్పుడు కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలని బలంగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే తాను అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్తున్నానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారీ మార్పులు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. మిగిలిన రెండున్నరేళ్లు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పని చేయాలని సీనియర్ నేతగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

Read Also: రూ.8 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు?: జూపల్లి

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>