Mobile Popup Ad
Mobile Popup Ad

వర్ధన్నపేటలో ఉద్రిక్తత.. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆందోళన

కలం, వరంగల్ :  వరంగల్ (Warangal) జిల్లాలోని వర్ధన్నపేట (Wardhannapet) పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుబ్బేటి తండాకు చెందిన సపవాట్ మౌనిక కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరగడం లేదంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మౌనిక ఆరోపణల ప్రకారం, ఆమె భర్త సపవాట్ సురేష్ వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడని, తన తండ్రి హత్య కేసులో కూడా అతని ప్రమేయం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించినప్పటికీ సరైన స్పందన లేదని ఆమె కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే, సురేష్‌కు జనగాం ఎమ్మెల్యే  పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) అండ ఉందని, అందువల్ల పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుతం సురేష్, మౌనికను ఒంటరి చేసి ముగ్గురు పిల్లలను తన వద్ద ఉంచుకొని వేరుగా ఉంటున్నాడని తెలిపారు. తన పిల్లలను తిరిగి అప్పగించాలని కోరగా, కొందరు పోలీసులు లంచం డిమాండ్ చేశారని మౌనిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. హత్య కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన సురేష్‌ను పోలీసులు కాపాడుతున్నారని వారు మండిపడ్డారు. ఈ క్రమంలో, పోలీస్ స్టేషన్‌లో మౌనికను సురేష్‌తో కలిసి కొట్టించారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, మౌనిక కుటుంబ సభ్యులు వర్ధన్నపేట (Wardhannapet) పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ‘మాకు న్యాయం చేయాలి, లేకపోతే చావడానికైనా సిద్ధం’ అంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

Read Also: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. OSD రాధా పండిట్ నియామకం రద్దు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>