సీఎం విజయ్ కీలక నిర్ణయం.. OSD రాధా పండిట్ నియామకం రద్దు!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత కార్యదర్శి (OSD)గా రాధా పండిట్‌ను నియమిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఈ నియామకంపై ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి విజయ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాల్లో ఎలాంటి వివాదాలకు తావుండకూడదనే ఉద్దేశంతోనే, విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఈ నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనతో విజయ్‌ది ప్రజా ప్రభుత్వమని చెప్పక తప్పదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read Also: ఎమ్మెల్యే పదవికి పశ్చిమ బెంగాల్ సీఎం రాజీనామా

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>