Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ ఇంట‌ర్ బోర్డు వ‌ద్ద హై టెన్ష‌న్‌..!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం (Telangana Inter Board) దగ్గర నేడు మ‌ధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్రొగ్రెసివ్ డెమోక్రెటిక్ స్టూడెంట్ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో నేడు ఇంట‌ర్ బోర్డు ముట్ట‌డికి (PDSU Protest) పిలుపునిచ్చారు. దీంతో భారీగా త‌ర‌లివ‌చ్చిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయ‌కులు బోర్డు కార్యాల‌యం ముందు ధ‌ర్నాకు దిగారు. ప్రైవేటు కాలేజీల్లో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్స్, వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వ‌హించ‌డంపై పీడీఎస్‌యూ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స‌ద‌రు కాలేజీ యాజ‌మాన్యాల‌ మీద క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం విడుద‌ల చేస్తున్న జీవోలు కేవలం గవర్నమెంట్ కాలేజీలకు మాత్రమే పని చేస్తున్నాయ‌ని, ప్రైవేటు కాలేజీలు ఇష్టా రాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల‌ను ప్రైవేట్ కాలేజీలు లెక్క‌చేయ‌డం లేద‌ని చెప్పారు. నిబంధనలు పాటించని కాలేజీల మీద చర్యలు తీసుకోవాలని నిరసన వ్య‌క్తం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిర‌స‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టారు. రోడ్డుపై బైఠాయించిన వారిని అరెస్ట్ చేశారు.

Read Also:  మంత్రి సొంత జిల్లాలో మంచినీళ్ళకు కరువు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>