కలం వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranti) పండుగ వేళ ప్రయాణికుల రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్(Private Travels)కు భారీ డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఛార్జీలు పెంచితే బస్సులను సీజ్ చేస్తామని తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ (Transport Commissioner) మనీష్ కుమార్ హెచ్చరించారు. ఇప్పటికే అధికారులు బస్సు ఛార్జీలపై దృష్టి సారించారని పేర్కొన్నారు. నిత్యం ఛార్జీల తీరును గమనిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీకి తిరిగే బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎవరైనా అధిక ఛార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Read Also: ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణ.. ఇక ట్రాఫిక్ జామ్‌కు బైబై..!
Follow Us On: Pinterest


