కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జిన్నారం ఆర్ఐ పై (Jinnaram RI) లంచం ఆరోపణలు (Bribery Allegations) రావడం కలకలం రేపింది. ఆర్ఐ ఓ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్ఐ జయప్రకాష్ ఓ వ్యక్తి నుంచి హోటల్ వద్ద రాత్రి సమయంలో డబ్బులు తీసుకోవడం వీడియోలో రికార్డు అయ్యింది. గడ్డపోతారంలోని అలీనగర్ 27 సర్వే నంబర్ అసైన్డ్ భూమిలో అక్రమ నిర్మాణాలపై లంచం తీసుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం ఆ నిర్మాణాలు కూల్చివేయడంతో డబ్బులు ఇచ్చిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జయప్రకాష్ ఐదేళ్లుగా జిన్నారం ఆర్ఐ పని చేస్తున్నారు. గతంలోనూ ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయని తహశీల్దార్ దేవదాస్ చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమగ్ర నివేదిక కోరారు.

Read Also: ఫార్మా కంపెనీ రగడ.. ఉద్యమం చేస్తామని రైతుల వార్నింగ్
Follow Us On : WhatsApp


