కలం, నల్లగొండ బ్యూరో: ‘‘తెలంగాణలో కొత్త పార్టీకి స్పేస్ ఉంటుందనుకోవడం లేదు. చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయి” అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. బుధవారం ఆయన మీడియా చిట్ చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితనుద్దేశించి గుత్తా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘కవిత (Kavitha) ఎమోషనల్గా నిర్ణయం తీసుకున్నప్పుడు బాధ్యతగా ఆలోచించుకోమని చెప్పాం. ముందు పీఏతో రాజీనామా లేఖ పంపారు. ఆమె వ్యక్తిగతంగా వచ్చి రాజీనామాను ఆమోదించమని చెప్పింది. కాబట్టే రాజీనామాను ఆమోదించాం. మండలిలో కవిత ఒక్కతే ఉంది. అందువల్లే మైక్ ఇచ్చాం. రాజీనామా చేయడానికి ఆమె కారణాలు చెప్పింది. కవిత నాతో ఫోన్లో మాట్లాడిందనేది తప్పుడు ప్రచారం ” అని గుత్తా అన్నారు.
నల్లగొండ కార్పొరేషన్ కావాలని అందరం కోరుకున్నామని, అది సాధ్యపడిందన్నారు. హిల్ట్ పాలసీ అనేది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి చేసిందని, మూసీ పొల్యూషన్ అయ్యిందే సిటీలోని ఇండస్ట్రీస్ వల్లేనని, ఈ అఫెక్ట్ నల్లగొండ జిల్లాపై పడిందని, మా జిల్లా మంత్రుల పనితీరు బాగుందని కితాబిచ్చారు. ఫిబ్రవరి వరకు మండలి కొత్త బిల్డింగ్ పూర్తి అవుతుందని అభిప్రాయపడ్డారు.

Read Also: ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ : కమిషనర్ మనీష్ కుమార్
Follow Us On: Instagram


