హైదరాబాద్‌లో రేపు నేషనల్ మొబిలిటీ సమ్మిట్

కలం, వెబ్ డెస్క్ : రవాణా రంగం అభివృద్ధి, విద్యుత్‌ వాహనాలు తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా రేపు నేషనల్‌ మొబిలిటీ సమ్మిట్‌ (National Mobility Summit) నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ,ఎలెట్స్ టెక్నోమీడియా సంస్థ, హైదరాబాద్ మెట్రో రైల్‌ భాగస్వామ్యం తో రేపు నోవోటెల్, హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో 2వ నేషనల్ మొబిలిటీ సమ్మిట్–2026 జరగనుంది. “Accelerating the Future of Mobility” అనే థీమ్‌తో నిర్వహించనున్న ఈ సమ్మిట్‌లో దేశంలో రవాణా రంగం, స్మార్ట్‌ మొబిలిటీ, ఎలక్ట్రిక్‌ వాహనాలు, నగర రవాణా అభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు.

సమ్మిట్ (National Mobility Summit) ప్రారంభ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా కమిషనర్ డా. కె. ఇళంబరితి, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొననున్నారు. ఈ సమ్మిట్‌లో విధాన నిర్ణేతలు, రవాణా అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు, స్టార్టప్‌ల, అలాగే సాంకేతిక సంస్థలు పాల్గొని దేశంలో స్థిరమైన మరియు సమగ్ర మొబిలిటీ భవిష్యత్తుపై చర్చించనున్నారు. మొబిలిటీ రంగంలో అభివృద్ధి ధోరణులు, విధాన మార్పులను ప్రతిబింబించే eGov Magazine ప్రత్యేక సంచికను కూడా విడుదల చేయనున్నారు.

Read Also: ఆ విషయంలో స్పీకర్ బాధ్యత తీసుకోవాలి: హరీశ్ రావు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>