Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ విషయంలో స్పీకర్ బాధ్యత తీసుకోవాలి: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: ఖచ్చితంగా అసెంబ్లీ పని దినాలు పెంచాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశామని బీఆర్ఎస్ఎల్పీ (BRSLP) డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీని నడుపుతామని ప్రభుత్వం చెప్పిందన్నారు. అందులో రెండు ఆదివారాలు, రెండు పండుగలు పోతే అసెంబ్లీని (Assembly) ఎన్ని రోజులు నడుపుతారని తాము ప్రశ్నించినట్లు తెలిపారు. ఆదివారాలు సైతం అసెంబ్లీ పెట్టాలని కోరినట్లు చెప్పారు. మార్చి 30వ తేదీ వరకు సభ నడుపుతామని అన్నారని..తాము కనీసం మార్చి 31వ తేదీ వరకు సభ పెట్టండి అని అన్నామని చెప్పారు. ఈ విషయంపై సీఎంతో మాట్లాడి చెప్తామని వారు చెప్పినట్లు తెలిపారు. 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్పిందని వివరించారు. మంగళవారం అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేదని.. దీనిపై తాము ప్రశ్నించినట్లు తెలిపారు.

అన్‌స్టార్డ్ క్వశ్చన్స్, జీరో అవర్ ప్రశ్నలకు సమాధానం ఇప్పటివరకు రాలేదని హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను తాము కోరినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వివరించారు. మేము మాట్లాడుతుంటే సీఎం, సంబంధిత శాఖా మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి మాత్రమే మాట్లాడాలని చెప్పామని తెలిపారు. సీఎంపై బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్(Privilege Motion) ఇస్తే పట్టించుకోవడం లేదని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 19 అంశాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ తరపున అడిగామన్నారు. అసెంబ్లీ లైబ్రరీ పరిస్థితి దారుణంగా ఉందని బీఏసీలో ప్రభుత్వానికి చెప్పామని తెలిపారు. బీఏసీ మినిట్స్ ఫాలో కాకపోతే వచ్చే బీఏసీని బీఆర్ఎస్ పార్టీ బాయ్ కాట్ చేస్తుందని హెచ్చరించినట్లు వివరించారు. అసెంబ్లీని 9 గంటలకు పెట్టాలని బీఏసీలో డిమాండ్ చేసినట్లు తెలిపారు. అసలు ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్‌ను పెట్టలేదని.. ప్రివిలేజ్ మోషన్స్ తీసుకునేది డిప్యూటీ స్పీకర్ అని కాంగ్రెస్ నేతలకు గుర్తు చేసినట్లు చెప్పారు. ప్రివిలేజ్ మోషన్స్ విషయంలో స్పీకర్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: హైదరాబాద్‌లో రేపు నేషనల్ మొబిలిటీ సమ్మిట్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>