కలం, ఖమ్మం బ్యూరో: గృహప్రవేశ వేడుకలో భాగంగా ఫొటో దిగుతుండగా ఓ మహిళ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన ఖమ్మం (Khammam) కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పట్టణంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత ఆమె బంధువుల ఓ గృహ ప్రవేశవేడుకకు వెళ్లారు. స్టేజ్ మీద ఫొటో దిగే సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. వెంటనే కుటుంబికులు హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. అనుకోని సంఘటనతో కుటుంబసభ్యులు, ఇతర బంధువులు తీవ్ర విషాదానికి గురయ్యారు. అప్పటివరకూ సరదాగా మాట్లాడిన మనిషి విగతజీవిగా మారడంతో ఒక్కసారిగా ఫంక్షన్ వాతావరణం, విషాదకరంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు వాపోతున్నారు.
Read Also: AI పై రేపు జర్నలిస్టులకు వర్క్ షాప్
Follow Us On: Facebook

