కలం, వెబ్ డెస్క్: పార్లమెంట్ శీతకాల సమావేశాలు శుక్రవారంతో ముగిసిన విషయం తెలిసిందే. 18వ లోక్ సభలో ఎంపీల పనితీరుపై పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉత్తమ ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలిచారు. పీఆర్ఎస్ నివేదిక ప్రకారం.. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలు(Telangana MPs) ఉత్తమ ప్రదర్శన కనబర్చారు. వీరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యుత్తమ పనితీరు కనబర్చారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi), బీజేపీ ఎంపీ డీకే అరుణ(DK Aruna) ఉన్నారు.
చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) భువనగిరి ఎంపీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాలపై తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలపై విమర్శలు చేసి, పలు ప్రాజెక్టుల పరంపరలో అవినీతిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలంగాణలో, కేంద్ర రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉత్తమ ఎంపీగా పేరు తెచ్చుకుంటున్నారు.
Read Also: చైనాలో డ్యాన్స్ ఇరగదీసిన రోబోలు, వీడియో వైరల్
Follow Us On: Sharechat


