కలం వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి(Cold) వణికించేస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు(Temperatures Drop) పడిపోయాయి. 19 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రాయలసీమ(Rayalaseema)లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డుంబ్రిగూడలో అత్యల్పంగా 4.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అరకులో 5, పాడేరులో 6, చింతపల్లిలో 6.5 డిగ్రీలుగా నమోదైంది. తెలంగాణ(Telangana)లో పటాన్‌చెరులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమురంభీమ్ ఆసిఫాబాద్ లో 6.2 డిగ్రీలు, మంచిర్యాలలో 6.5, సంగారెడ్డి, నిజామాబాద్ లో 6.7, భూపాలపల్లిలో 6.8, నిర్మల్ లో 6.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హనుమకొండలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్(Hyderabad)లో 10.8 ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఉమ్మడి మెదక్(Medak) జిల్లాలను చలి వణికిస్తోంది. కోహిర్‌లో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లో జనం ఉదయాన్నే బయటకు రావడానికే జంకుతున్నారు. రానున్న ఐదు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి(Temperatures Drop).
Read Also: రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి
Follow Us On: Sharechat


