కలం, వెబ్ డెస్క్: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాకా రోబోలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. విద్య, వైద్యం, సినిమాలతోపాటు ఇంటి పనులు, వంట పనులు, ఇతర కార్యాకలపాలకు కూడా రోబోలు సేవలందిస్తున్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే.. రోబోలు డ్యాన్సర్లుగా అవతారమెత్తాయి. రియల్ డ్యాన్సర్లు ఎలా స్టెప్పులు వేస్తారో.. అంతకుమించి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాయి. చైనాలో డ్యాన్స్ ఇరగదీసిన రోబోల(China Robots) వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.
చైనా యూనిట్రీ కంపెనీకి చెందిన G1 హ్యూమనాయిడ్ రోబోట్లు(China Robots) చైనీస్-అమెరికన్ గాయకుడు వాంగ్ లీహోమ్ కాన్సర్ట్‌లో డ్యాన్స్ చేశాయి. ఈ ప్రదర్శన చైనాలోని చెంగ్డూ నగరంలో జరిగింది. రోబోట్లు స్టేజ్‌పై బ్యాకప్ డ్యాన్సర్లుగా పాల్గొన్నాయి. రియల్ డ్యాన్సర్లుగా స్టెప్పులు వేసి వావ్ అనిపించాయి. వీటిలో ఫ్రంట్ ఫ్లిప్స్ లాంటి అద్భుతమైన స్టెప్స్ కూడా ఉండటం హైలైట్. ఏకకాలంలో రోబోలు డ్యాన్స్ చేసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. రోబోట్లు మెటాలిక్ దుస్తులు ధరించి, రంగురంగుల లైట్ల మధ్య డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
Read Also: అమెరికాకంటే ఇండియా డబుల్.. AI వాడకంలో మనమే టాప్!
Follow Us On: X(Twitter)


