కలం వెబ్ డెస్క్ : అస్సాం(Assam)లో ఘోర రైలు ప్రమాదం(Train Accident) చోటు చేసుకుంది. హోజాయ్ జిల్లాలో రాజధాని ఎక్స్ ప్రెస్(Rajdhani Express) ఏనుగుల మందను ఢీకొని రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది ఏనుగులు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సైరాంగ్ నుంచి ఢిల్లీ(Delhi) బయల్దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ హొజాయ్ జిల్లాలో ఏనుగుల మందను ఢీకొట్టినట్లు నార్త్‌ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే వెల్లడించింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, అంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో సదరు రూట్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
Read Also: చైనాలో డ్యాన్స్ ఇరగదీసిన రోబోలు, వీడియో వైరల్
Follow Us On: Instagram


