కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో 2026 సంవత్సరానికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2026) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షలను జూన్ 15 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ప్రతి ఏటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి తొలివిడత పరీక్షకు విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో ప్రాథమిక పాఠశాల (క్లాస్ 1-5) ఉపాధ్యాయ అర్హతకు పరీక్ష ఉంటుంది. పేపర్-2లో ఉన్నత ప్రాథమిక పాఠశాల (క్లాస్ 6-8) ఉపాధ్యాయ అర్హతకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఒకే పేపర్ లేదా రెండు పేపర్లకు అప్లై చేసుకోవచ్చు.
అధికారిక వెబ్ సైట్: https://tgtet.aptonline.in/UI/HomePage/HomePage.aspx
Read Also: సింగర్ మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్.. అడ్వకేట్‌కు ఆల్కహాల్ టెస్ట్
Follow Us On: Sharechat

