కలం, వెబ్ డెస్క్: పంజాగుట్ట (Punjagutta) పోలీస్ స్టేషన్ వేదికగా సింగర్ మంగ్లీ (Singer Mangli) కేసు విషయంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఈ కేసు బాధితులతో కలిసి వచ్చిన అడ్వకేట్ సుబ్బారావు మద్యం సేవించి ఉన్నారనే అనుమానంతో పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో 27 పాయింట్లు నమోదు కావడంతో ఆయన మద్యం సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. తాను రాత్రి సేవించిన మద్యం ప్రభావం వల్ల అలా వచ్చి ఉండవచ్చని సుబ్బారావు వాదించారు.
పోలీసులు కావాలనే తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించడంతో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అయితే తాము డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేయలేదని, కేవలం మద్యం సేవించి వాహనం నడపడం క్షేమకరం కాదని వివరించే ప్రయత్నం చేశామని పోలీసులు తెలిపారు. అడ్వకేట్ తమతో అనవసరంగా వాదనకు దిగారని పోలీసులు చెప్పారు.
Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
Follow Us On : WhatsApp

