తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఇంటర్ సెక్రటరీ యోగితా రాణా కలిసి అధికారికంగా ఈ రిజల్ట్స్‌ (Telangana Inter Results)ను వెల్లడించారు.

ఈ ఏడాది తెలంగాణవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షల (Inter Results) కోసం మొత్తం 9,70,075 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి 4,89,126 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 4,80,949 విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://tgbie.cgg.gov.in/ కి లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

అమ్మాయిలదే పైచేయి..

ఈ ఏడాది కూడా ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులలో మొత్తం 66.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అందులో అమ్మాయిల శాతం 74.40గా ఉంది. అబ్బాయిలు 57.69 శాతం ఉత్తీర్ణత సాధించారు.

రెండవ సంవత్సరం ఫలితాల్లోనూ ఇదే ఒరవడి కొనసాగింది. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 70.58 శాతం మంది విద్యార్థులు విజయం సాధించారు. ఇక్కడ కూడా అమ్మాయిలు 78.65 శాతంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరచగా, అబ్బాయిలు 62.50 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే గణనీయమైన ఆధిక్యాన్ని కనబరచడం విశేషం.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>