చెన్నై కెప్టెన్‌కు భారీ జరిమానా.. ఎందుకంటే?

కలం, వెబ్ డెస్క్:  ఐపీఎల్ 2026లో ఎట్టకేలకు గెలుపు బాట పట్టిన ఆనందంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ (CSK Captain) రుతురాజ్ గైక్వాడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా గైక్వాడ్‌కు భారీ జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు గైక్వాడ్‌కు రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.

ఈ సీజన్‌లో చెన్నై జట్టుకు ఇది మొదటి తప్పు కావడంతో కనీస జరిమానాను అమలు చేశారు. అయితే, ప్రస్తుత సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడ్డ మూడవ కెప్టెన్ రుతురాజ్ (CSK Captain Ruturaj Gaikwad) కావడం గమనార్హం. గతంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెండుసార్లు ఈ నిబంధనను ఉల్లంఘించి రూ. 24 లక్షల జరిమానా కట్టగా, ఏప్రిల్ 8న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఇదే తరహా జరిమానాకు గురయ్యారు.

Read Also: RR మేనేజర్ వివాదం.. డగౌట్‌లో ఫోన్ వాడి ప్రోటోకాల్ ఉల్లంఘన!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>