శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం: డెకరేషన్ గోదాం దగ్ధం

కలం, వెబ్​ డెస్క్​ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి (Shivarampally)లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సర్వారెడ్డి కాలనీలో ఉన్న ఒక డెకరేషన్ మెటీరియల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలో భారీగా ప్లాస్టిక్ వస్తువులు, ఫ్లెక్సీ బ్యానర్లు, థర్మాకోల్ నిల్వ ఉండటంతో మంటలు క్షణాల్లో ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రత పెరగడంతో మంటలు పక్కనే ఉన్న ఒక నివాస గృహానికి కూడా వ్యాపించాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు, అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>