epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

చీటింగ్​ కేసులో బీజేపీ కీలక నేతకు బెయిల్​

కలం/ఖమ్మం బ్యూరో: నమ్మకద్రోహం, చీటింగ్ సెక్షన్ల కింద నమోదైన కేసులో పోలీసులకు లొంగిపోవాలని ‘సిరి గోల్డ్’ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్, బీజేపీ నాయకుడు కూసంపూడి రవీంద్ర (Kusampudi Ravindra) ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న రవీంద్ర ముందస్తు బెయిల్​ కోసం చేసుకున్న పిటిషన్​ను గురువారం న్యాయస్థానం విచారించింది. అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పిటిషనర్ రవీంద్ర రెండు వారాల్లోపు ఉప్పల్ పోలీస్​ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఆ తర్వాత అతడిని హౌజ్ ఆఫీసర్ బెయిల్​పై విడుదల చేయాలని చెప్పింది. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతోపాటు రూ.25,000 వ్యక్తిగత బాండ్​ సమర్పించాలని రవీంద్రను కోర్టు ఆదేశించింది. ఎనిమిది వారాల పాటు ప్రతి బుధవారం పోలీస్ స్టేషన్​లో హాజరు కావాలని పేర్కొంది. కేసు దర్యాప్తునకు దర్యాప్తునకు అధికారులకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>