కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (municipal elections) ప్రక్రియలో భాగంగా మొదటి రోజు నామినేషన్ల పర్వం ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 902 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు ఇంక రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ముందుకు వచ్చి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 382 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 258 మంది తమ నామినేషన్లు వేశారు. అలాగే బీజేపీ తరఫున 159 మంది అభ్యర్థులు, మరో 52 మంది స్వతంత్ర అభ్యర్థులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నామినేషన్లు దాఖలు చేశారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన జరగనున్నది.


