వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Sessions) మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధిని ఉద్దేశించి సభలో నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) కీలక వ్యాఖ్యలు చేశారు. 236 లక్షల టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. తొమ్మిది రోజుల్లోనే ఎనిమిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం జమచేసిందని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 65 లక్షల రైతులకు లబ్ధి చేకూరిందని గవర్నర్​ వివరించారు.

రాష్ట్రంలోని పేద ప్రజలతో పాటు సన్న బియ్యాన్ని సంక్షేమ హాస్టళ్లకూ అందిస్తున్నామని తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా సామాన్యులకు చేరవేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త రేషను కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 15.62 లక్షల కొత్త కార్డులు ఇప్పటికే జారీ అయ్యాయని స్పష్టం చేశారు. ఇంతేకాకుండా ఇప్పటికే వినియోగంలో ఉన్న కార్డుల్లో కొత్తవారి పేర్లు చేర్చామని వివరించారు.

రాష్ట్రంలో 1.05 కోట్ల రేషను కార్డులు ఉన్నాయని.. దీంతో 3.38 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోందన్నారు. పేదలకు నివాస వసతి కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) నిర్మాణాన్ని చేపట్టిందని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు మూడున్నర వేల చొప్పున నిర్మిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు 24 వేలకు పైగా ఇళ్లను నిర్మించిందని.. మరో 16 వేలు తుది దశలో ఉన్నాయని గవర్నర్​ (Governor Shiv Pratap Shukla) స్పష్టం చేశారు.

Read Also: పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>