పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో తెలుగు జాతి గౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) భారీ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu).. అమరావతి పరిధిలోని తుళ్లూరులో పొట్టి శ్రీరాముల (Potti Sriramulu) 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను చంద్రబాబు గుర్తుచేశారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని సరిగ్గా 58 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Deputy CM Pawan Kalyan), మంత్రులు నారా లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌, టీజీ భరత్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల్లో స్మృతివనం నిర్మితమవుతోంది. ఆర్యవైశ్య సంఘాలు, ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అమరజీవి 125వ జయంతి వేడుకలను భారీస్థాయిలో ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. సుమారు 6.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ‘స్మృతివనం’లో కేవలం విగ్రహమే కాకుండా, ఒక మ్యూజియం, ఆడిటోరియం, ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>