Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులతో పాటు నాన్ కేడర్ అధికారులను బదిలీ (IAS Transfers) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు పలు కీలక శాఖలకు కొత్త అధికారులను నియమించారు. అలాగే పలువురు అధికారులకు అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

ఈ మేరకు మైన్స్ & జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎన్. శ్రీధర్ ను ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ సెక్రటరీగా ఉన్న రఘునందన్ రావుకు మైన్స్ & జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. రాహుల్ బొజ్జా ను రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతల్లో కూడా ఈయన కొనసాగుతారు.

గిరిజన, సంక్షేమ శాఖల బాధ్యతల్లో కొనసాగుతున్న శ్రీ సవ్యాసాచి ఘోష్ కు చేనేత, జౌళి, హస్తకళల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. శైలజా రామయ్యర్ ను పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అలాగే దేవాదాయ శాఖ, ఈపీటీ‌ఆర్ఐ డీజీపీ కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీమ్ పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం.. మైనారిటీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక సెక్రటరీగా ఉన్న అజిత్ రెడ్డికి ఇన్వెస్ట్ తెలంగాణకు బదిలీ చేసిన ప్రభుత్వం.. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎంగా ఉన్న మహమ్మద్ ముషారఫ్ అలీ ఫారూఖీకి TGREDCO వీసీ & ఎండీగా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. పి. కాత్యాయని దేవి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ ఎండీ పోస్టు నుంచి ఐఆండ్‌సీ (చేనేత, జౌళి) శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. టీజీరెరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న కె. గంగాధర్ ను రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది.

ఇదిలాఉంటే టి. వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఓఎస్డీగా ఉన్న శ్రీ కె. విద్యాసాగర్ ను టూరిజం డైరెక్టర్‌గా నియమించడంతో పాటు ‘ప్రజావాణి’ స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. జీహెచ్ఎంసీ (శంషాబాద్) జోనల్ కమిషనర్ కె. చంద్రకళకు హెచ్ఎండీఏ (HMDA) జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ బదిలీల ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని చీఫ్ సెక్రటరీ కే. రామకృష్ణారావు జీవోలో వెల్లడించారు.

Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>