Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీపై కడుపుమంటతోనే ‘సర్’పై ఆరోపణలు: సునీల్ రావు

కలం, కరీంనగర్ బ్యూరో : ఓటరు జాబితాను ప్రక్షాళన చేసి.. పకడ్బందీ ఓటర్ల జాబితాను తయారు చేయడమే “ఎస్ఐఆర్” (SIR) ముఖ్య ఉద్దేశమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) అన్నారు. కరీంనగర్‌లో శుక్రవారం ఎస్‌బి‌ఎస్ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోగస్ ఓట్లను తొలగించి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు.

చాలా మంది ఎస్ఐఆర్ ఎందుకు చేపడుతున్నారని సందేహం వ్యక్తం చేస్తున్నారని, దానికి చాలా కారణాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్బనైజేషన్ పెరిగిందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల కంటే ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ప్రజలు కరీంనగర్ పట్టణంలో నివసిస్తున్నారని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరికి రెండు చోట్ల ఓటు ఉండటం, చనిపోయిన వ్యక్తుల ఓటు అలాగే ఉండటం, ఓటర్ రిజిస్ట్రేషన్లు అధికంగా చేసుకోవడం, అర్హత లేని ఓటర్లు జాబితాలో ఉండటం లాంటి పలు కారణాల రిత్యా ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా అవసరమని మేయర్ (Yadagiri Sunil Rao) తెలిపారు. ఇలాంటి బోగస్ ఓట్లను సరిదిద్దడానికి.. ఓటర్ జాబితాను శుద్ది చేయడానికే ప్రభుత్వం “సర్” తో ఇంటింటి సర్వేను చేపట్టిందని తెలిపారు.

భారతీయ పౌరుడైన ప్రతి వ్యక్తి ఓటు హక్కును పొందాలని… దేశ పౌరుడు కాని వ్యక్తి జాబితాలో ఉండే అర్హత లేదని అది చట్టరిత్యా నేరం అన్నారు. ప్రతి యువతి యువకులు ఓటు హక్కును తప్పక ఎన్‌రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. తప్పుల తడక లేకుండా.. శుద్దీ చేయబడిన ఓటర్ల జాబితా రూపొందించాలనే గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంటే… దీనికి పలు రాజకీయ పార్టీలు చాలా కారణాలు చూపిస్తుండటం శోచనీయం అన్నారు.

రాజకీయ పార్టీల నాయకులు ఎస్ఐఆర్ ప్రక్రియ పై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్నాయని సునీల్  రావు మండిపడ్డారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ఆటంకం కలిగించి… ప్రజలను తప్పుదోవ పట్టించడమే ప్రయత్నంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ప్రజల అభిమానం, మద్దతు తో గెలుస్తుంది తప్పా… ఎస్ ఐఅర్ ప్రక్రియ వల్ల కాదని ఆయన వెల్లడించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తూ.. ఎస్ఐఆర్ ప్రక్రియ పై ప్రజలకు అనవసరపు ఆందోళన కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరమే ఎన్నికలు జరిగాయని… మరి అక్కడ బీజేపీ ఎందుకు గెలవలేదని సునీల్ రావు ప్రశ్నించారు. ఎక్కడా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఎవ్వరికీ అన్యాయం జరగలేదని… అన్ని వర్గాలకు సమన్యాయం తక్కిందని మేయర్ అన్నారు.

సర్ ప్రక్రియ మొదటి సారి జరగడం లేదని… గతంలో కూడా జరిగిందన్నారు. ఇవన్నీ చెప్పకుండా… ఎస్ఐఆర్ ప్రక్రియ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. బీజేపీ పై కడుపు మంటతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు సర్ పై ఆరోపణలు చేస్తున్నారు తప్పా… ఎక్కడ పసలేదని నిప్పులు ఆయన చెరిగారు.

ఎస్ఐఆర్ లో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు కలిగి ఉంటుందని.. కేవలం బోగస్ ఓట్లు మాత్రమే తొలగించబడతాయని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పార్టీ ఆద్వర్యంలో చేయడం లేదని…. అధికార యంత్రాంగం చేస్తుందని అన్నారు. అర్హులైన ఓటు హక్కును తొలగించే అధికారం ఏ అధికారికి లేదని యాదగిరి సునీల్ రావు తెలిపారు.

ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించాలని… ఎస్ఐఆర్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సునీల్ రావు సూచించారు. అవకతవకలను సరిదిద్ది… సక్రమమైన ఓటరు జాబితాతో ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాలనే గొప్ప లక్ష్యంతోనే ” సర్” ప్రక్రియ కొనసాగుతుందని ఆయన అన్నారు.

ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రక్రియకు ప్రజలు సహాకరించి… శుద్ధమైన ఓటర్ల జాబితా తయారీకి కృషి చేయాలని సునీల్ రావు పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు బండారి వేణు, కేపీపీ చంద్ర, పొన్నం లక్ష్మీ మొండయ్య, తోట అనిల్, కర్రె అనిల్, బీజేపీ నాయకులు పండగ నాగరజు, రెడ్డివేణి రాజు, చిగురు రవీందర్, నాగరాజు గురు స్వామి, వాడే వెంకట్ రెడ్డి, అనిల్, రమేశ్ గౌడ్, రాజ్ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>