కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి సర్కిల్ పరిధిలోని రుద్రారం సెక్షన్ పరిధిలోని గీతం యూనివర్సిటీకి (GITAM University) తెలంగాణ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. విద్యుత్ బకాయిలను మూడు వారాల్లోగా రూ.54 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. గీతం యూనివర్సిటీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థకు రూ.118 కోట్ల రూపాయల విద్యుత్ బకాయి పడిన విషయం తెల్సిందే.
సంస్థ పరిధిలో వివిధ సర్కిళ్ల నుండి డిస్కం కు దాదాపు 2400 కోట్ల రూపాయలు కోర్టు కేసులతో లింక్ అయివున్నాయి. ఈ మొండి బకాయిల వసూళ్ళలో భాగంగా గతేడాది జులై లో సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దానిలో భాగంగా బకాయిదారులందరికీ డిస్కనెక్షన్ నోటీసులు జారీ చేశారు. దీంతో కొంత మంది వినియోగదారుల నుండి దాదాపు 500 కోట్ల రూపాయిల మేర వసూలయ్యాయి.
అయితే గీతం యూనివర్సిటీ (GITAM University) మాత్రం బకాయి చెల్లించకుండా హైకోర్ట్ ఆశ్రయించింది. కేసును విచారించిన ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన హై కోర్ట్ బెంచ్ మూడు వారాల్లోగా బకాయిల్లో 50 శాతం అనగా 54 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాల్సిందిగా వర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించింది. కోర్ట్ తీర్పుతో యూనివర్సిటీ యాజమాన్యానికి ఊహించని షాక్ తగిలినట్లయింది.
Read Also: ‘అన్న’లు వెళ్లిపోయారు.. ఆయుధాలు మిగిలాయి
Follow Us On : WhatsApp


