కలం, వెబ్ డెస్క్ : మేడారం మహాజాతరలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ (Telangana Governor) జిష్ణు దేవ్ వర్మ శుక్రవారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. గద్దెల వద్దకు చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గద్దెలపై కొలువుదీరిన వనదేవతలకు గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన మొక్కులో భాగంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. గవర్నర్ వెంట మంత్రి సీతక్క పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.
Read Also: మేడారంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
Follow Us On : WhatsApp


