రేపు కర్రెగుట్టలకు డీజీపీ శివధర్ రెడ్డి.. హైఅలర్ట్!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) రేపు కర్రెగుట్టల (Karreguttalu) ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముర్మూరు బేస్ క్యాంప్ నుంచి తడపల వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఆ ప్రాంతంలోని గుత్తికోయలతో ఏర్పాటు చేసిన ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’లో పాల్గొంటారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. డీజీపీ పర్యటనను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: యుద్ధం ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై కేంద్రం కీలక ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>