డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం.. దెబ్బతిన్న వాహనాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ (Telangana DGP) శివధర్ రెడ్డి కాన్వాయ్ ట్రయల్ రన్ సందర్భంగా ప్రమాదం జరిగింది. డీజీపీ పర్యటనకు ముందు భద్రతా ఏర్పాట్లలో భాగంగా ములుగు (Mulugu) జిల్లా వెంకటాపురం సమీపంలో పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ క్రమంలో వెంకటాపురం వద్ద వాహనాలు వేగంగా వెళుతుండగా.. ఓ పోలీసు వాహనం అదుపుతప్పి ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు వెంటనే ఆ వాహనాలను పక్కకు తొలగించారు.

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సువర్ణతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP) పర్యటించనున్నారు. కర్రెగుట్టలోని (Karregutta) పామునూరు సీఆర్పీఎఫ్ బస్ క్యాంపును డీజీపీ పరిశీలిస్తారు. ఆ తర్వాత పోలీసు ఔట్ పోస్టుకు భూమి పూజ చేస్తారు. ఆ ప్రాంతంలోని గ్రామాలకు వేస్తున్న రోడ్లను పరిశీలిస్తారు. డీజీపీ కర్రెగుట్ట పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన స్థానిక గుత్తికోయలతో సమావేశం కానున్నారు.

Read Also: హ‌రీశ్ రావు అరెస్ట్‌.. షాద్ నగర్ వైపు తరలింపు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>