కలం, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “AA22xA6” వర్కింగ్ టైటిల్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రీ-లుక్ పోస్టర్ విడుదలైంది. ఎలాంటి ముందస్తు హింట్స్ లేకుండా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఇప్పటికే భారీ సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఈసారి అల్లు అర్జున్‌తో కలిసి మరింత గ్రాండ్ లెవెల్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
తాజాగా విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్‌లో భయంకరమైన బ్యాక్‌గ్రౌండ్‌తో ఒక తోడేలు చేయి చూపించారు. అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని గెటప్‌లో కనిపించబోతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను AA22xA6 అని పిలవడం వెనుక కూడా ప్రత్యేకత ఉంది. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ చిత్రం కాగా, అట్లీ తెరకెక్కిస్తున్న ఆరో సినిమా. ఈ కాంబినేషన్ ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సృష్టించింది.
అట్లీ గత చిత్రం జవాన్ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌తో చేసిన ఆ చిత్రం తర్వాత అట్లీ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రీ లుక్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రేపు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఉదయం 11 గంటలకు గ్రాండ్ రిలీజ్ చేయయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Read Also: అవును పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాను.. త్రిష షాకింగ్ కామెంట్స్
Follow Us On: Instagram

