కలం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet Meeting) ఈ నెల 23న జరగనున్నది. సచివాలయంలో ఆ రోజు సాయంత్రం జరిగే మీటింగ్‌లో కీలకమైన అంశాలపై చర్చించే అవకాశమున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కావడంతో బడ్జెట్‌లో నిధుల కేటాయింపులకు అనుగుణంగా పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల మరమ్మత్తు పనులపై లోతుగా చర్చించే అవకాశమున్నది. వీటితో పాటు త్వరలో జరగనున్న జనాభా లెక్కల సేకరణ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహకారం తదితరాలపైనా చర్చించనున్నట్లు సమాచారం. వరి ధాన్యం సేకరణ, సన్న వడ్డు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్, రానున్న విద్యా సంవత్సరంలో తీసుకురానున్న మార్పులు తదితరాలపై చర్చించే అవకాశమున్నది.
వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నియమాక ప్రక్రియ, పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణతోపాటు జీహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించే అవకాశమున్నది. దీనికి తోడు వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాలు, రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, సమర్ధ వినియోగంపై ఇరిగేషన్ శాఖకు సూచనలు తదితరాలపై కూడా క్యాబినెట్‌లో (Telangana Cabinet Meeting)చర్చ జరగవచ్చని సచివాలయ వర్గాల సమాచారం.
Read Also: జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌లో చీలిక: అద్దంకి దయాకర్
Follow Us On: Instagram

